కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని తెలిపారు. సోమవారం ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని అంగన్వాడి కేంద్రంలో ఆయన గర్భిణీలకు న్యూట్రీషన్ కిట్లను పంపిణీ చేశారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందుతున్న సహాయ సహకారాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ బాబు, అధికారులు పాల్గొన్నారు.