సంక్రాంతి సందడి: చింతాడ సంతలో పండుగ సరుకుల కొనుగోళ్లు జోరు

శ్రీకాకుళం రూరల్ మండలంలోని చింతాడ వారపు సంత సంక్రాంతి పండుగ సందర్భంగా జనసంద్రమైంది. పండుగకు అవసరమైన కూరగాయలు, బియ్యం, పప్పులు, నూనె, బెల్లం, నువ్వులు, పండ్లు, పూలు వంటి సరుకులను కొనుగోలు చేయడానికి పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కోళ్లు, గొర్రెలు, పందుల కొనుగోళ్లతో పాటు పండుగ ప్రత్యేక వంటకాల కోసం అవసరమైన సరుకులపై ప్రజలు ఆసక్తి చూపారు. సంత పండుగ వాతావరణంతో కళకళలాడింది.

సంబంధిత పోస్ట్