శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట, దుప్పలవలస, కంచిలి, కొల్లివలసలోని డా.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్లకు అడ్మిషన్లు జరుగుతున్నాయని జిల్లా కోఆర్డినేటర్ మేరీ గ్రేస్ గురువారం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, దరఖాస్తులను ఆగస్టు 4వ తేదీలోగా పంపించాలని ఆమె కోరారు.