ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

వజ్రపు కొత్తూరు మండలం దేవునత్తాడలో మనస్తాపంతో లండ జగదీశ్ (38) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసైన అతన్ని భార్య భారతి పలుమార్లు మందలించింది. శుక్రవారం మరోసారి తాగి ఇంటికి రావడంతో ఆమె నిలదీయడంతో, జగదీశ్ ఇంట్లోకి వెళ్లి పంకాకు ఉరేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్