శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో నూతన సంవత్సర వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రాంమోహన నాయుడు (బాబాయ్, అబ్బాయ్) జంటగా పాల్గొన్నారు. అభిమానులు, అధికారులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో కలిసి వీరు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని, తరలివచ్చిన ఆహుతులను సాదరంగా ఆహ్వానించి వారితో ఉల్లాసంగా గడిపారు.