భీష్మ ఏకాదశి: నారాయణ తిరుమలకు భక్తులు పోటెత్తారు

భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా గురువారం వేకువజాము నుంచే శ్రీకాకుళంలోని నారాయణ తిరుమలకు భక్తులు పోటెత్తారు. నారాయణ ఘోషతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో వెల్లివిరిశాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేశామని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ తెలిపారు. ఏటా భీష్మ ఏకాదశి రోజున ఇక్కడ వెంకటేశ్వరస్వామికి విశేష సేవలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్