శ్రీకాకుళం నగరంలో ఆదివారం దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎం. పి., కేంద్ర విమానయాన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ, ప్రజాభిమానమే ఆస్థిగా, స్వార్థమెరుగని నాయకునిగా, అనునిత్యం ప్రజా ప్రయోజనాలకై పరితపిస్తూ, జిల్లా ప్రజలందరి హృదయాలలో స్వర్గీయ ఎర్రన్నాయుడు చెరగని ముద్ర వేసారని, ఆయన జిల్లా కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, టీడిపి. నాయకులు, కారుకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.