శ్రీకాకుళం నగరంలో జి. టీ. రోడ్డు, 80-ఫీట్ రోడ్డు, అరసవెల్లి జంక్షన్, పాలకొండ రోడ్డు, డే అండ్ నైట్ జంక్షన్ వంటి కీలక ప్రాంతాల్లో నిత్యం అక్రమ పార్కింగ్స్ దర్శనమిస్తున్నాయి. నగరంలో ప్రత్యేక పార్కింగ్ జోన్లు ఉన్నప్పటికీ, కొందరు వాహన చోదకుల నిర్లక్ష్యం వల్ల తరచూ ఇబ్బందులు, ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై సంబంధిత యంత్రాంగం దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు.