కోట బొమ్మాలి: శక్తి యాప్ ఉంటేనే రక్షణ లభిస్తుంది

బుధవారం కోటబొమ్మాలి మండలం హరిచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శక్తి యాప్ పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి టీం సభ్యులు గిరిధర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ లో శక్తి యాప్ ఉంటేనే పూర్తి రక్షణ లభిస్తుందని తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే ఈ యాప్ ద్వారా రక్షణ పొందవచ్చని, లేకపోతే ఇబ్బందులలో ఉన్నప్పుడు రక్షణ కరువవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్