కోటబొమ్మాలి మండలం తులసి పేట గ్రామానికి చెందిన జోగి అప్పన్న చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకోవడంతో తల్లి లక్ష్మి సహకారంతో చదువుకున్నానని తెలిపాడు. శుక్రవారం విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో 141/200 మార్కులు సాధించి సివిల్ కానిస్టేబుల్ గా ఎంపిక అయ్యానని అన్నాడు. తన తల్లి కష్టాన్ని వృధా చేయలేదని భవిష్యత్తులో ఎస్సై ఉద్యోగం సాధించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నాడు. గ్రామస్తులు అభినందించారు.