కోటబొమ్మాలి: కండక్టర్ పై దాడి.. లోపలకు వెళ్ళమన్నందుకే..?

పలాస నుండి విశాఖపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులో కోటబొమ్మాలి జంక్షన్ వద్ద బుధవారం మధ్యాహ్నం కండక్టర్ ఎం. పాపారావుపై దాడి జరిగింది. బస్సు రద్దీగా ఉందని, లోపలికి వెళ్లాలని కోరడంతో ఒక వ్యక్తి దుర్భాషలాడుతూ దాడి చేశాడని కండక్టర్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి, బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్