కోటబొమ్మాలి మండలం తిలారు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో స్వామివారి కల్యాణోత్సవం బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తర్ర రామకృష్ణ దంపతులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా గురువారం వరకు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.