రాష్ట్రంలో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకొని కూటమి ప్రభుత్వం వెళుతుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. సోమవారం మందస మండలం బహడపల్లి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ క్రమంలో స్థానిక మహిళలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఆమె మాట్లాడుతూ పలాస నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం తనకు ఎంతో సహకరిస్తుందని వివరించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.