టెక్కలి మండలం సీతాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం హెచ్ఎం టి పద్మావతి ఆద్వర్యంలో ఘనంగా మెగా PTM 2.0 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లల చదువులపై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు, కొన్ని ముఖ్యమైన సలహాలను ఉపాధ్యాయులకు తెలియజేశారు. కార్యక్రమం అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి, భోజనాలు ఏర్పాటు చేశారు.