నందిగాం: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలికి గాయాలు

నందిగాం మండలం గొల్లూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం టెక్కలి వెళ్లేందుకు అడివమ్మా అనే వృద్ధురాలు బస్సు కోసం వేచి చూస్తుండగా ద్విచక్ర వాహనంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆమె కాలు విరిగిపోయింది. నేషనల్ హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స చేసి టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్