నందిగాం: ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

నందిగాం మండలంలోని దిమ్మిడిజ్వాల గ్రామానికి చెందిన 15 మందికి ఇళ్లపట్టాలు అందజేశారు మంత్రి అచ్చెన్నాయుడు. ఆదివారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ఈ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి విడతల వారీగా పట్టాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. సొంతింటి కల నెరవేర్చడమే కూటమి లక్ష్యమన్నారు.

సంబంధిత పోస్ట్