శ్రీకాకుళం లో సమ్మె విజయవంతం చేయాలనే పుస్తక ఆవిష్కరణ

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2025 నవంబర్ 21 నుండి అమలు చేయనున్న నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ శ్రీకాకుళంలో ఒక పుస్తకాన్నిశనివారం  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి. తేజేశ్వరరావు, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ కే నాగమణి, ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం ఆదినారాయణ మూర్తి,  సిఐటియు జిల్లా కోశాధికారి ఎ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్