అదుపుతప్పిన కారు.. తప్పిన ప్రమాదం

టెక్కలిలో మంగళవారం సాయంత్రం స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో ఒక కారు అదుపుతప్పి ముందుకు దూసుకుపోయింది. రైల్వే స్టేషన్ రోడ్డు నుంచి వచ్చిన కారు ఒక్కసారిగా పనులు జరుగుతున్న ప్రాంతంలోకి దూసుకెళ్లడంతో స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు, దీంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డు పనుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్