టెక్కలిలో శుక్రవారం పోలీసులు ఒక యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. తన ఇంటి సమీపంలోని మైనర్ బాలికను కొంతకాలంగా వేధిస్తున్న యువకుడు, ఇటీవల తల్లితండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలికను మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.