పురుగుమందు తాగి పోర్టు సూపర్ వైజర్‌ ఆత్మహత్యాయత్నాం

సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టులో సూపర్ వైజర్ గా చేస్తున్న బోర మల్లేష్ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విధులకు వెళ్లి వచ్చిన ఆయన స్థానిక నౌపడలో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్