సంతబొమ్మాళి: కుప్పకూలిన కల్వర్టు.. రాకపోకలకు అంతరాయం

బోరుభద్ర–మేఘవరం ఆర్ అండ్ రోడ్డులోని చిదపానవానిపేట కూడలిలో శుక్రవారం రాత్రి కల్వర్టు కూలిపోయింది. వంశధార సాగునీరు తరలించేందుకు ఎప్పటికో ఏర్పాటు చేసిన ఈ కల్వర్టుపై భారీ రొయ్యలు, పోర్టు లారీలు ప్రయాణించడంతో దెబ్బతిని కూలిపోయిందని స్థానికులు అంటున్నారు. దీంతో బోరుభద్ర, నౌపడ వైపుల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యార్థులు, ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

సంబంధిత పోస్ట్