రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు తెలిపారు. శనివారం సాయంత్రం టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం దండు గోపాలపురం గ్రామంలో ఆయన పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి అండగా సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అందజేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.