సంతబొమ్మాళి (మ)మూలపేట వాసి రాజు ఆదివారం కోటబొమ్మాళి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడి తీవ్రగాయాలపాలై కన్నుమూశాడు. రాజుకు ఇటీవలే వివాహం జరిగింది. పెళ్లయిన 21 రోజులకే ఈ ఘటన జరగటంతో కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. కాల పారాణి ఆరకముందే వధువుకు ఇటువంటి కష్టం రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.