రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడు, సోమవారం సంతబొమ్మాలి మండలం తోటాడ గ్రామంలో జరిగిన భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భద్రత పెన్షన్లు అందిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్లు అందజేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణమూర్తి కూడా పాల్గొన్నారు.