శ్రీకాకుళం: జగన్ పర్యటన సినిమాసెట్టింగ్‌ మాదిరిగాఉంది: అచ్చెన్న

మాజీ సీఎం జగన్ పర్యటన ప్రాంతంలో శాంతి భద్రతలు భంగపెట్టేలా వైసీపీ కార్యకర్తలు విధ్వంసం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. చిత్తూరులో సమస్యలు సృష్టించేందుకే జగన్ పర్యటన చేశారని విమర్శించారు. డ్రోన్లతో ప్రాంతాన్ని చిత్రీకరించామన్నారు. మామిడిని రోడ్డుపై పోసి డ్రామా సృష్టించారని, జగన్ పర్యటనలకు డబ్బులు ఇచ్చి మరీ జనసేకరణ చేస్తున్నారని ఆరోపించారు. వందమీటర్ల దూరంలో హెలిప్యాడ్ అనుమతి ఇస్తామంటే ఒప్పుకోలేదని చెప్పారు. క్రిమినల్ ఆలోచనలు, సెట్టింగులతో జగన్ పర్యటన చేశారని మంత్రి అచ్చెన్న బుధవారం విమర్శించారు.

సంబంధిత పోస్ట్