సంతబొమ్మాలి శాఖా గ్రంథాలయంలో సమ్మర్ క్యాంప్ లో భాగంగా విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ మరియు నీతి కథల పుస్తకాలు చదివించారు. ఈ సందర్భంగా గ్రంథాలయానికి రేకల లోకనాథం, కొన్న శివ గార్లు రెండు సీలింగ్ ఫ్యాన్లను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి రామకృష్ణ, పప్పు భీమారావు, చైతన్య ప్రసాదరావు, సహాయకులు బాబురావు, విద్యార్థులు పాల్గొన్నారు.