బుధవారం టెక్కలి మండలం బొప్పాయిపురం జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. గార ప్రాంతానికి చెందిన వ్యక్తి కారులో శ్రీకాకుళం నుంచి టెక్కలి వైపు వస్తుండగా, అదే మార్గంలో వచ్చిన లారీ అదుపుతప్పి కారును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం దెబ్బతిన్నప్పటికీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టెక్కలి హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.