టెక్కలి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో శక్తి యాప్ పట్ల అవగాహన సదస్సు నిర్వహించామని శక్తి హెడ్ కానిస్టేబుల్ ఎం గిరిధర్ తెలిపారు. ఆదివారం స్థానిక వసతి గృహానికి వెళ్లిన బృందం సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థిని తప్పనిసరిగా తమ తమ సెల్ఫోన్లో శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ యాప్ వల్ల ఎంతో ప్రయోజనం ఉందని తెలియజేశారు. ఈ యాప్ వినియోగం పట్ల వారికి అవగాహన కల్పించారు.