ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ శక్తి యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని శక్తి టీం హెచ్‌సిఎం గిరిధర్, కానిస్టేబుల్స్ భీమారావు, విజయలక్ష్మి తెలిపారు. సోమవారం టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ భీంపురం ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఈ విషయం వెల్లడించారు. సాధారణ గ్రామాలతో పోలిస్తే ఈ గ్రామం ప్రభుత్వ సేవలకు దూరంగా ఉందని, తప్పనిసరిగా పోలీస్ రక్షణ అవసరమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.