టెక్కలిలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో హాజరైన వైసీపీ ఇన్‌ఛార్జ్ పీరాడ తిలక్ భావోద్వేగంతో ప్రసంగించారు. తాను టికెట్ కోసం కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ కోసం కష్టపడుతున్నానని స్పష్టం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు సేవకుడిగా ఉంటానని చెప్పారు. ప్రాణం ఉన్నంత వరకు వైసీపీతోనే ఉంటానని తిలక్ భావోద్వేగంగా ప్రకటించారు.