మంగళవారం రాత్రి టెక్కలి మండలం గంగాధర పేటలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్సై రాము మాట్లాడుతూ, గ్రామాలలో అపరిచిత వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తుల సంచారం వలనే దొంగతనాలు జరుగుతున్నాయని, వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.