టెక్కలి: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

టెక్కలి పెద్దబ్రాహ్మణవీధిలో బుధవారం ధూపాన కామేశ్వరరెడ్డి (65) అనే వృద్ధుడు విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. ఇంట్లోని దేవుని గదిలో సీరియల్ లైట్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి ఆయన కుప్పకూలారని కుటుంబసభ్యులు తెలిపారు. వెంటనే టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్