టెక్కలిలో శనివారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ గ్యారంటీ కార్యక్రమం 'బాబు షూరిటీ - మోసం గ్యారంటీ'గా చేపట్టింది. ఇందులో ఇటీవల నియమితులైన అనుబంధ విభాగాల ప్రతినిధులు పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు, రవి కుమార్, ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు.