తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సోమవారం శ్రీ కోదండ రాముని అవతారంలో హనుమంతునిపై స్వామివారు ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, చెక్కభజనలు, కోలాటాల వేడుకలతో వాహనసేవ ఘనంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి దర్శనం పొందారు. సాయంత్రం 4–5 గంటల స్వర్ణరథ, రాత్రి 7 గంటలకు గజవాహన దర్శనం ఉంటుంది. కార్యక్రమంలో పెద్దజీయర్, చిన్నజీయర్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు, జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో మురళీకృష్ణ ఇతరులు పాల్గొన్నారు.