AP: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసుపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఆయనపై చర్యలకు రంగం సిద్ధం చేసింది. జనవరి 11న ఓ ఎస్టీ మహిళపై దాడి చేశారని కొలికపూడిపై ఆరోపణలు వచ్చాయి. దాడి ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా కొలికపూడిపై టీడీపీ హైకమాండ్ చర్యలు తీసుకోనుంది. సోమవారం టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.