AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటలో 9 మంది మృతి చెందడంపై రాజకీయ దుమారం రేగింది. వైసీపీ నేతలు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆలయ నిర్వాహకులు పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది మూడో ఘటన అని, తిరుపతి, సింహాచలం ఘటనల్లో చర్యలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాశీబుగ్గ ఘటనపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని బొత్స కోరారు.