మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటనలో తొక్కిసలాట చోటుచేసుకుంది. జగన్ పిలుపుతో వైసీపీ కార్యకర్తలు కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. దీంతో కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ మాలకొండయ్యాకు గాయాలయ్యాయి. తోపులాటలో కానిస్టేబుల్ మాలకొండయ్యకు చేయి విరగగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైసీపీ కార్యకర్తలను నియంత్రించే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.