తొక్కిసలాట ఘటన.. ఎవరిది నిర్లక్ష్యం? (వీడియో)

AP: వరుస ప్రమాద ఘటనలు రాష్ట్రంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదం (19 మృతి) మరువకముందే, శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట మరోసారి రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ రెండు ఘటనలకూ నిర్వాహకుల నిర్లక్ష్యమే మూలకారణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాశీబుగ్గలో ఆలయ ప్రచారం, సౌకర్యాల లేమి కలిపి 10 మంది ప్రాణాలు బలిగొన్నాయి. ఎవరో చేసిన తప్పుకి ఇతరులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇకనైనా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్