భారత్‌లో 'స్టార్‌లింక్' శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు బ్రేక్

భారత్‌లో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు వార్తలు వెలువడ్డాయి. కేంద్ర హోంశాఖ తుది భద్రతా అనుమతులను నిలిపివేసినట్లు సమాచారం. ఇరాన్ యుద్ధంలో స్టార్‌లింక్ టెర్మినల్స్ వినియోగంపై భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేయడంతో, భారత భద్రతా నిబంధనలకు సంస్థ పూర్తిగా కట్టుబడి ఉంటుందా అనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్ వివాదంతో అనుమతుల ప్రక్రియ నిలిచిపోయిందన్న వార్తలను స్టార్‌లింక్ ప్రతినిధులు ఖండించినట్లు సమాచారం. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్