ఇంకా కనిపించని చిన్నారి జాడ.. మిస్టరీగా మారిన కేసు (వీడియో)

AP: కాకినాడ జిల్లా తుని మండలంలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమైన ఘటన మిస్టరీగా మారింది. పాప కనిపించకుండా పోయి వారం రోజులు గడిచినా ఆచూకీ లభించలేదు. దొండవాక పంచాయతీ పరిధిలోని పామాయిల్ తోటలో తల్లిదండ్రులతో ఉంటున్న జాహ్నవి గత శనివారం కనిపించకుండా పోయింది. దాదాపు 200 మంది పోలీసులతో ప్రత్యేక బృందాలు అడవి, కొండ ప్రాంతాలు, చెరువులు, బావుల్లో గాలింపు చేపట్టాయి. పాప వెంట వెళ్లిన పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి గాలించినా ఆధారాలు దొరకలేదు. దీంతో చిన్నారి అడవిలో తప్పిపోయిందా? లేక కిడ్నాప్‌కు గురైందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్