AP: కడప జిల్లా, పులివెందులలో పోలింగ్ ప్రారంభానికి ముందే హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామునే సరస్వతి విద్యా మందిర్ పోలింగ్ కేంద్రం వద్ద కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మాస్కులు ధరించి కర్రలతో హల్చల్ చేశారు. అల్లరి మూకలు పోలింగ్ కేంద్రంపై రాళ్లు విసిరినట్లు సమాచారం. ఏజెంట్లను పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లకుండా అడ్డుకునేందుకే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భద్రతను ఉల్లంఘిస్తూ జరిగిన ఈ దాడిపై ఆందోళన వ్యక్తమవుతోంది.