వైసీపీ ఎమ్మెల్సీ కారుపై రాళ్ల దాడి (వీడియో)

AP: వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రచారం ముగించుకుని వస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కారుపై కొందరు దుండగులు రాళ్ల దాడి చేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో మరింత ఉద్రిక్తత నెలకొంది. కూటమి నేతలే దాడి చేశారని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. దాడికి నిరసనగా వైసీపీ నేతలు నల్లని కండువాలు ధరించి పాత బస్టాండ్ కూడలి వద్ద ఆందోళనకు దిగారు.

సంబంధిత పోస్ట్

✕
✕