AP: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అర్నబ్ తుఫాన్ అల్లకల్లోలం సృష్టించింది. యానాం సమీపంలో అర్నబ్ తుఫాన్ తీరం దాటి బలహీనపడింది. దీని ప్రభావంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు, తీవ్ర ఈదురుగాలులు వీచాయి. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాపై తుఫాన్ ప్రభావం ఉంది. ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. రోడ్లపై భారీ వృక్షాలు కూలడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, సహాయక సిబ్బంది దిగారు. అరటి, వరి పంటలకు భారీ నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా.