తుఫాన్ బీభత్సం.. బస్సుపై కూలిన భారీ వృక్షం (వీడియో)

AP: ఏలూరులో అర్నబ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. పలాస నుంచి విజయవాడ వెళ్తున్న ప్రతాప్ ట్రావెల్స్ బస్సుపై భారీ వృక్షం విరిగిపడింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించి బస్సును ఆపారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలవ్వగా.. ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్

✕
✕