AP: రాష్ట్రవ్యాప్తంగా 'మొంథా' ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలోని పద్మనాభం మండలంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. తునిపొలం గ్రామం వద్ద ప్రమాదవశాత్తు వాగులో జారిపడి ఓ బాలిక గల్లతైంది. కాళ్ల ధనుశ్రీ (13) తల్లి గౌరి, తండ్రి శ్రీనుతో కలిసి బట్టలు ఉతకడానికి వాగుకి వెళ్లింది. ఆ సమయంలో పొరపాటున కాలుజారి వాగులో కొట్టుకుపోయిందని తల్లి గౌరి తెలిపారు. దీంతో ధనుశ్రీ ఆచూకీ కోసం గ్రామస్తులు, పోలీసులు ఘటనా స్థలిలో గాలిస్తున్నారు.