తుఫాన్ ఎఫెక్ట్... ఈ జిల్లాల్లో భారీగా వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను సోమవారం తెల్లవారుజామున తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, నెల్లూరు, కడప, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్