AP: ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు, తుఫాన్ ప్రభావం కారణంగా ఒంగోలు కార్పొరేషన్, అద్దంకి, చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ను అధికారులు వాయిదా వేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. తుఫాన్ తీవ్రత తగ్గిన తర్వాత మాత్రమే కౌంటింగ్ ప్రక్రియ చేపడతామని ఆయన స్పష్టం చేశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల ఫలితాల వెల్లడిని తాత్కాలికంగా నిలిపివేయడం గమనార్హం. తదుపరి తేదీని పరిస్థితిని బట్టి అధికారులు ప్రకటించనున్నారు.