AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది వాయవ్య దిశగా కదులుతూ కొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ నెల 18న ఉదయానికి బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మారే ఛాన్సుందన్నారు. దీని ప్రభావంతో ఈ నెల 18, 19న ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 18న శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 19న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఉ.గోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.