తీరం దిశగా మొంథా తుఫాన్

AP: కాకినాడ, కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం మధ్య మొంథా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం వైపు మెంథా తుఫాన్ చురుగ్గా కదులుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పుదుచ్చేరి ప్రభుత్వం యానాం పరిధిలో 16 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసింది. కనీస సౌకర్యాలను ఏర్పాటు చేశామని యానాం సబ్ కలెక్టర్ అంకిత్ కుమార్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్