AP: తీవ్ర తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్ పరిధిలోని సుమ్మాదేవి, తాలభద్ర వద్ద రైల్వే పట్టాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పట్టాలపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది ట్రాక్‌పై వరద నీటిని తొలగించి, రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.